శని దోషాలు పోగొట్టే తిరునల్లార్ శని దేవాలయం గురించి తెలుసా?

ఏలిన నాటి శని దోషాలు నిత్యం ఏదో ఒక రాశి వారిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయి. అలాగే అర్ధాష్టమ శని కూడా బాధ పెడుతూ ఉంటుంది. ఈ శని దోషాలున్న వారు ఆర్థికంగానూ.. ఆరోగ్యపరంగానూ.. ఇతర సమస్యలతో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని పోగొట్టుకునేందుకు శనికి చేసే పూజలతో పాటు ఒక్కసారి ఈ శని దేవాలయాన్ని సందర్శిస్తే ఎలాంటి దోషమైనా తొలగిపోతుంది. ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో రెండు నదుల మధ్య తిరునల్లార్ శని దేవాలయం ఉంది.

ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. శనిదేవుని స్థానం మారినప్పుడు ఇబ్బంది పడే రాశి వారు, అలాగే ఏలినాటి శని బాధలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. అతి ప్రాచీన చరిత్ర కలిగిన తిరునల్లార్ శని దేవాలయాన్ని దర్భారణ్యేశ్వర స్వామి క్షేత్రం అని కూడా అంటారు. ఈ ఆలయాన్ని నల మహారాజు దర్శించుకున్నాడని చెబుతారు. ఇక్కడి ఆలయంలోని ‘నల’ పుష్కరిణిలో స్నానం చేస్తే శని బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని తొలుత చోళులు అభివృద్ధి చేయగా తర్వాతి కాలంలో మరికొందరు రాజులు అభివృద్ధి చేశారు.

Share this post with your friends