పొరుగు రాష్ట్రంలో పూజలందుకుంటున్న శాంకరీ క్షేత్రం గురించి తెలుసా?

దక్షయజ్ఞంలో సతీదేవి శరీర త్యాగం చేసిన కథ గురించి తెలిసిందే. సతీదేవి శరీరంతో పరమేశ్వరుడు రుద్ర తాండవం చేస్తుండగా.. శ్రీ మహావిష్ణువు శివుడిని శాంతింప చేయడానికి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. ఆ శరీర భాగాలన్నీ భూమిపై పలు ప్రదేశాల్లో పడిపోయాయి. ప్రస్తుతం ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా విరాజిల్లుతున్నాయి. ఈ శక్తి పీఠాలన్నీ అత్యంత శక్తివంతమైనదిగానే భావిస్తారు. వాటిలో శాంకరీ దేవి క్షేత్రం కూడా ఒకటి. ఆ క్షేత్ర విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ముందుగా శాంకరీ దేవి శక్తి పీఠం ఎక్కడుందో తెలుసుకుందాం.

శాంకరి దేవి ఆలయం మన దేశంలో లేదు. శ్రీలంక తూర్పు తీరంలో ట్రింకోమలీలో ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది. ట్రింకోమలీలో సతీదేవి శరీర భాగాల్లో ఏది పడిందనే విషయమై క్లారిటీ లేదు. కాలి పట్టీలు పడ్డాయని హిందూ పురాణాలు చెబుతుండగా.. అమ్మవారి తొడ భాగం పడిందని అంటారు. ఏది ఏమైనప్పటికి శాంకరి దేవి ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ప్రథమ పీఠంగా విరాజిల్లుతోంది. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి కారణంగా ఈ ఆలయం ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రమే ఉండగా.. దీనికి సమీపంలోనే త్రికోణేశహవర స్వామి అనే శివాలయం పక్కనే కొత్త ఆలయాన్ని ఏర్పాటు చేశారు.

Share this post with your friends