
మన దేవాలయాల నిర్మాణం అనేది వాస్తు ప్రకారంగానే కాదు.. శాస్త్రీయ పరంగానూ అద్భుతంగా ఉంటుంది. అసలు దేవాలయాల్లోని శాస్త్రీయత ఏంటి? ఏ ఏ ప్రదేశంలో ఎలాంటి శాస్త్రీయత దాగి ఉందో తెలుసుకుందాం.
1.మూలవిరాట్: భూమిలో ఎక్కడైతే ఎలక్ట్రానిక్, మాగ్నటిక్ తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు కేటలిస్ట్‌గా పని చేస్తాయి.
2. ప్రదక్షిణ: మనం గుడి చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. పుణ్యక్షేత్రాలు వేదిక్ ఆర్కిటెక్చర్ మీద ఆధారపడి ఉంటాయి. ఇవి మన శరీరంలోని షట్ చక్రాలను ప్రభావితం చేస్తాయి.
3. ఆభరణాలతో దర్శనం: ఆడవారిని, మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.
4. కొబ్బరి కాయ: ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.
5. మంత్రాలు: ఒక ఫోన్ నంబర్‌ను మనం గుర్తుంచుకునేందుకు ఒక న్యుమరస్‌ని తెలియకుండానే యాక్టివేట్ చేస్తాం. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి న్యూమరాన్‌లను ఉత్తేజపరుస్తాయి.
6. గర్భగుడి: గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే భగవంతుని దర్శించుకునే సమయంలో మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.
7. అభిషేకం: విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి.
8. హారతి: పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.
9. తీర్థం: ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.
10. మడి: తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి
