
రామాయణంలో లంకాధీశుడు రావణుడి గురించి హిందువులందరికీ తెలుసు. ఆయననొక రాక్షసుడిలా చూస్తారు. సీతాదేవిని అపహరించి.. చివరకు రాముడి చేతిలో హతమయ్యాడు. వాస్తవానికి దీనిని మినహాయిస్తే రావణుడు కూడా చాలా గొప్పవాడు. పౌలస్య బ్రహ్మ వారసుడు మాత్రమే కాకుండా.. నవ వ్యాకరణ పండితుడు. అంతకు మించి అత్యంత శివ భక్తుడు. అలాంటి రావణుడిని కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు కట్టి మరీ పూజిస్తారు. అయితే ఇది ఎక్కువగా శ్రీ లంకలో జరుగుతుంది. ఆసక్తిక విషయం ఏంటంటే.. ఏపీలోనూ రావణుడి ఆలయం ఉంది. దాని గురించి తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో రావణుడి ఆలయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ఈ రావణుడి ఆలయం అత్యంత ప్రసిద్ధ ఆలయాలలో ఒకటి కావడం విశేషం. ఆసక్తికర విషయం ఏంటంటే.. శివుడు కొలువైన ఈ ఆలయాన్ని నిర్మించడానికి రావణుడే స్వయంగా ఈ స్థలాన్ని ఎంచుకున్నాడని చెబుతారు. ఈ ఆలయంలో భారీ శివలింగం ఉంటుంది. రావణుడు ఎంతటి శివ భక్తుడనేది ఈ ఆలయమే చెబుతుంది. కాకినాడ బీచ్‌కి దగ్గరగా ఈ శివాలయం ఉంటుంది. ఇక్కడ రావణాసురుడిని సైతం పూజిస్తారు. ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ ప్రదేశంగా విరాజిల్లుతున్న ఈ ఆలయం.. ఏపీలో రావణుడిని పూజించే ఏకైక ప్రదేశంగా విరాజిల్లుతోంది.
