నాగలమడక సుబ్రహ్మణ్య స్వామి గురించి తెలుసుకున్నాం. ఈ ఆలయంలో ఉండే శిల్పమే ఒక అద్భుతం. ఇది ఎలా ఉంటుందంటే.. మూడు చుట్లు చుట్టుకుని ఏడు శిరస్సులతో నాగప్ప స్వామి శిల్పం ఉంటుంది. మూడు అడుగుల ఈ శిల్పాన్ని చూసిన భక్తులకు తక్షణమే భక్తి భావన ఏర్పడుతుంది. ఇక్కడ పాపాలను పోగొట్టే పుల్లి విస్తర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నాగలమడకలో ఒక విచిత్రమైన ాచారం ఉంది. అదే పుల్లి విస్తర్ల ఆచారం. ఏడాదికి ఒకసారి నిర్వహించే బ్రహ్మ రథోత్సవం నిర్వహిస్తారని తెలుసుకున్నాం కదా.
ఈ రథోత్సవంలో పాల్గొనేందుకు లక్షలాది మంది తమ మొక్కుబడులు తీర్చడానికి ఈ ప్రాంతానికి వస్తుంటారు. అందులో విశిష్టమైనది పుల్లి విస్తర్లు. పులి విస్తర్లు అంటే ఇంకేదో కాదు.. బ్రాహ్మణులు భోజనం చేసి వదిలిన ఆకులు. ఇక్కడికి వచ్చిన వారు ఈ పులి విస్తర్లు తలపై పెట్టుకుని పినాకిని నదిలో స్నానం చేయడం ఇక్కడ అనాదిగా కొనసాగుతున్న ఆచారం. స్వామివారి రథోత్సవం అనంతరం బ్రాహ్మణులు భోజనం చేసిన తర్వాత విస్తర్లు విడుస్తారు. పులి విస్తర్లను ఏరుకుని వాటిని తలపై పెట్టుకుని పవన పినాకిని నదిలో తలస్నానం చేస్తే పాపాలు తొలగి మంచి జరుగుతుందట. ఆ తరువాత ఉపవాసం ఉంటారు.