సృష్టి, స్థితి, లయ కారకుల గురించి వివరించే లింగం గురించి తెలుసా?

ఇప్పటికే మనం రెండు ముఖలింగాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇప్పుడు మరో మూడు ముఖలింగాల గురించి తెలుసుకుందాం.

త్రిముఖ లింగం:

ఈ శివలింగం తూర్పు, ఉత్తర, దక్షిణముఖాలను కలిగి ఉంటుంది. తూర్పున ఉన్న తత్పురుష ముఖం చిరునగవుతో, దక్షిణవెైపుగానున్న అఘోరముఖం కోపంతో, ఉత్తరం వెైపునున్న వామదేవముఖం మందహాసంతో గోచరిస్తుంటాయి. ఈ త్రిముఖలింగం సృష్టి, స్థితి, లయకారకులెైన త్రిమూర్తులను సూచిస్తోందని కొందరి భావన, మంత్రార్చనతో, త్రిముఖ రుద్రాక్షమాలను స్వామికి సమర్చించుకుని, మూడు దళాల బిల్వ పత్రాలతో అర్చిస్తే సకల సంపదలు సమకూరుతాయి.

చతుర్ముఖ లింగం:

నాలుగు ముఖాల ఈ లింగానికి తూర్పున తత్పురుషం, పడమట సద్యోజాతం, ఉత్తరాన వామదేవం, దక్షిణాన అఘోర ముఖాలున్నాయి. ఈ నాలుగుముఖాలను నాలుగు వేదమంత్రాలతో పూజిస్తుంటారు. ఈ లింగాన్ని చతుర్ముఖ రుద్రాక్షలతో అలంకరించి బిల్వపత్ర పూజ చేస్తే, అలా పూజించిన వారి మేధస్సు పెరుగుతుందనేది ఐతిహ్యం.

పంచముఖలింగం:

ఈ పంచముఖ లింగాలు చాలా అరుదుగా కనిపిస్తుం టాయి. నాలుగు దిక్కులలో నాలుగు ముఖాలతో, తూర్పువెై పున ఐదవముఖంతో స్వామి దర్శనమిస్తుంటాడు. ప్రస్తుతం నిర్మిస్తున్న శివాలయాలలో చాలా మంది పంచముఖ శివ లింగాలను ప్రతిష్ఠించుకుంటున్నారు. పంచముఖ రుద్రాక్ష మాలను స్వామికి అలంకరించి, పంచగవ్యంతో అభిషేకిం చి, బిల్వ పత్రాలతో అర్చించి, ఐదు విధాలెైన ఉపచారాలను చేసి, పంచ నెైవేద్యాలను నివేధించాలి. ఈ ఐదు ముఖాల నుంచి ఆగమాలు వెలువడినందువల్ల దీనిని ‘శివాగమ లింగం’ అని కూడా పిలుస్తారు.

Share this post with your friends