దానానికి ఉన్న ప్రాధాన్యత గురించి తెలిస్తే..

హిందూ ధర్మశాస్త్రం దానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కర్ణుడి దాన గుణం కారణంగానే ఆయనను దాన కర్ణుడని పిలుస్తారు. మన దగ్గర ఉన్నదాన్ని నలుగురితో ఎంత పంచుకుంటే సంపద అంత పెరుగుతుందని చెబుతారు. దానం గురించి గొప్పలు చెప్పకూడదని అంటారు. ముఖ్యంగా కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి తెలియకూడదంటారు. అలాగే బలి చక్రవర్తి గురించి మనకు తెలిసిందే. ఆయన గురించి ఎంతటి గొప్ప ధనవంతుడో అందరికీ తెలిసిందే. తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా బలి చక్రవర్తి సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసి గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు.

బలి చక్రవర్తికి శ్రీ మహా విష్ణువుకే దానం చేసే అవకాశం రావడానికి అతి గత జన్మలో చేసుకున్న పుణ్యమేనట. బలి చక్రవర్తి గత జన్మలో ఒక దరిద్రుడట. దేవునిపై ఏమాత్రం నమ్మకం ఉండేది కాదట. నాస్తికుడిలా ఉంటూ వేద పండితులనూ.. దేవతలనూ నిత్యం ధూషిస్తూ ఉండేవాడట. అలాంటి బలి చక్రవర్తి తదుపరి జన్మలో ఏకంగా శ్రీ మహా విష్ణువుకి మూడడుగుల దానమిచ్చి అతను బలి చక్రవర్తిగా అవతరించాడు. చిరంజీవిగా ఏకంగా పాతాళ లోకానికే రాజై నిలిచాడు. దానం గొప్పతనం గురించి ఇంకా చెప్పాలంటే.. కేవలం దానం చేసినట్టు ఊహించినందుకే ఇంద్రుడికి ఆ పదవి దక్కిందట. అలాంటిది మనం మంచి మనసతో దానం చేస్తే కలిగే ఫలితాలు గొప్పగా ఉంటాయి.

Share this post with your friends