గాయత్రీ కవచంలో ఉన్న రూపాల వర్ణన గురించి తెలుసా?

గాయత్రీ కవచంలో ఉన్న రూపాలు తానే అయిన దేవి ఎలా వర్ణించబడిందో తెలుసా? గాయత్రి మంత్రంలోని రూపాలు ఎలా వర్ణన గురించి తెలుసుకుందాం.

గాయత్రి – తూర్పు దిక్కును
సావిత్రి – దక్షిణ దిక్కును
సంధ్యాదేవి – పడమర దిక్కును
సరస్వతి – ఉత్తర దిక్కును
పార్వతి – ఆగ్నేయాన్ని
జలశాయని – నైరుతిని
పవమాన విలాసిని – వాయువ్య దిక్కును
రుద్రాణి – ఈశాన్య దిక్కును రక్షీంచుగాక
తుత్ – పాదాలను
సవితుః – జంఘలను
వరేణ్యం – కటిని
భర్గః – నాభిని
దేవస్య – హృదయాన్ని
ధీమహి – చెక్కిళ్ళను
ధియః – నేత్రాలను
యః – లలాటంను
నః – శిరస్సును
ప్రచోదయాత్ – శిఖా భాగాన్ని రక్షించుగాక.

ఇంకా వివరంగా చెప్పాలంటే మన శరీరంలోని ప్రతి భాగం శ్రీ గాయత్రీ మాత రక్షణ కవచంలో భద్రంగా ఉంటాయి.

తత్ – శిరస్సు
సకారం – ఫాలం
వి – నేత్రాలు
తు – కపోలాలు
వ – నాసాపుటాలు
రే – ముఖం
ణి – పైపెదవి
యం – కింది పెదవి
భ – మద్య భాగం
ర్గో – చుబుకం
దే – కంఠం
వ – భుజాలు
స్య – కుడి చేయి
ధీ – ఎడమ చేయి
మ – హృదయం
హి – ఉదరం
ధి – నాభి
యో – కటి
యో – మర్మప్రదేశం
నః – తొడలు
ప్ర – జానువులు
చో – జంఘం
ద – గుల్ఫం
యా – పాదాలు
త్ – సర్వ అంగాలు

Share this post with your friends