ఆదివాసీలు వైభవంగా జరుపుకునే దండారి పండుగ గురించి తెలుసా?

దండారి పండుగ గురించి మీకు తెలుసా? ఇది కేవలం ఆదివాసీ గూడాల్లో మాత్రమే జరిగే సంబరం. ఆదివాసులు అత్యంత వైభవంగా ఈ దండారి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఆదివాసులు తమ ఆరాధ్య దేవతగా ‘ఏత్మాసార్ పేన్’ను భావిస్తూ ఉంటారు. ఈ ఏత్మాసార్ పేన్ పేరిట దండారి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ దండారి పండుగ.. దీపావళికి ముందు భోగి పండుగతో ప్రారంభమవుతుంది. కొలబొడితో పూర్తవుతుంది. మొత్తంగా పదిహేను రోజుల పాటు ఈ వేడుగ జరుగుతుంది. తరతరాల సంప్రదాయాన్ని ఆదివాసీలు కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుక కొనసాగుతుంది. ఈ పండుగ సమయంలో ఉమ్మడి ఆదిలాబాద్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా తుడుం మోతలు, డప్పుల చప్పుల్లు , గుస్సాడీ నృత్యాల ఆటపాటలే కనువిందు చేస్తాయి. ఆదివాసులంతా డప్పుల దరువులు, గజ్జెల మోతలు, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గుస్సాడీల నృత్యాలతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంటుంది. మరోవైపు కోలాటాలు, గోండిపాటల నృత్యాలు, హాస్యనాటికలు సైతం ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ దండారి పండుగను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక పండుగగా కూడా గుర్తించింది.

Share this post with your friends