మాఘమాసంలో వచ్చే పుణ్యతిథుల గురించి తెలుసా?

మాఘ మాసానికి ఎంతటి మహత్స్యం ఉందో తెలుసుకున్నాం. ఈ మాసంలోనే అత్యధిక సంఖ్యలో వివాహాలు జరుగుతుంటాయి. అలాగే నదీస్నానానికి సైతం ఈ మాసం చాలా మంచిది. అలాగే ఈ మాసంలో పుణ్య తిథులు ఏంటో కూడా తెలుసుకుందాం. మాఘమాసాన్ని శివకేశవులకు ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఈ మాసంలో ఎన్నో పుణ్య తిథులు, మరెన్నో పండుగలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి శ్రీ పంచమి, రథసప్తమి, భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి, మహా శివరాత్రి వంటి పండుగలు చాలా ఉన్నాయి. ఇక మాఘ మాసంలో వచ్చే ప్రతి ఆదివారం కూడా సూర్యునికి ప్రీతికరమైనదే.

మాఘ మాసంలో వివాహానికి ఎన్నో సుముహూర్తాలు ఉంటాయి. ఈ మాసంలో వివాహం జరుపుకుంటే వారి దాంపత్యం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగుతుందని విశ్వాసం. అందుకే పెళ్లిళ్లకు ఈ మాసాన్ని అత్యంత ఎక్కువ మంచి ఎంచుకుంటారు. కార్తీక మాసంలో ఎలాగైతే నెలంగతా కార్తీక పురాణాన్ని పారాయణ చేస్తామో ఈ మాసంలోనూ అలాగే మాఘ పురాణాన్ని పారాయణం చేస్తాం. ఈ మాఘ పారాయణం ఈ మాస విశిష్టతను తెలియజేస్తుందట. దీని వల్ల సకల పాపాలు నశిస్తాయని చెబుతారు. అందుకే ఈ మాసమంతా మాఘ పురాణాన్ని నిత్య పురాణం చేయాలని పండితులు చెబుతారు.

Share this post with your friends