
ప్రస్తుతం ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయాలన్నా, ఒక వ్యక్తి మరో వ్యక్తిపై దాడి చేయాలన్నా ఆయుధాలు తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. అయితే మహాభారత కాలంలో కత్తులు, కర్రలు, తుపాకీలు వంటి ఎలాంటి ఆయుధాలు లేకుండానే జరిగిన 5 యుద్ధాల గురించి మీకు తెలుసా? అది మహాభారతంలో జరిగింది. మరి ఆ ఐదు యుద్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. నిజమైన బలం..హింస లేకుండానే వస్తుందని జ్ణానం, సహనం, నిశ్శబ్దం, వినయం, ధర్మ యుద్ధం అనే ఐదు యుద్ధాలు మహాభారతంలో జరిగాయి. వాటిలో మొదటిది జ్ణాన యుద్ధం గురించి ముందుగా తెలుసుకుందాం.
మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో విదురుడు ఒకరు. తన జీవితాంతం నీతిగానే బతికిన విదురుడు..కత్తులు చేసే గాయాల కంటే మాటలు చేసే గాయాలెక్కువని నమ్మాడు. అందుకే ఆయన ఎప్పుడూ తన వాక్యాతుర్యంతో, వివేకంతోనే యద్ధాలు చేసేవాడు. విదురుడు అందించిన ప్రతి సలహా కురువంశం పతనమవ్వకుండా ఆపడానికి చేసిన ఒక సైద్ధాంతిక యుద్ధం. ధృతరాష్ట్రుడు అంధకారంలో కొట్టుమిట్టాడుతుంటే విదురుడు అతడికి దిక్సూచిలా నిలబడ్డాడు. ఆ సమయంలో హస్తినాపురానికి మంత్రి అయిన విదురుడు ధుర్యోధనుడి దుర్మార్గపు ఆలోచనలు ముందే పసిగట్టి హెచ్చరించాడు. ధర్మాన్ని కాపాడటానికి అతడు చేసిన ప్రతి ప్రయత్నం దురాశ, అహంకారంతో నిండిన శత్రువులపై శిశ్శబ్దంగా సాగిన భీకర పోరాటం. విదురుడి కథ దుర్మార్గంపై ధర్మం సాధించే నిశ్శబ్ద పోరాటానికి ఒక ఉదాహరణ.
