విష్ణుమూర్తి దశావతారాలు ఎత్తాడు. ఆ విషయం అందరికీ తెలుసు. దుష్ట సంహారం కోసం అలా విష్ణుమూర్తి అవతారాలు ఎత్తాడు. అయితే శివుడు కూడా పది అవతారాలు ఎత్తాడన్న విషయం ఎంతమందికి తెలుసు? ఆసక్తికర విషయం ఏంటంటే.. భోళా శంకరుడు మాత్రమే కాదు.. ఆయన భార్యగా పార్వతీ దేవి సైతం ఆయనతోపాటే అవతారాలు ఎత్తుతూ వచ్చింది. ఇంతకీ ఆ పది అవతారాలేంటంటారా? పది అవతారాల్లో మొదటిది.. మహాకాలుడు.. మహాకాళిగా పార్వతీ దేవి అవతారం ఎత్తింది. శివపార్వతుల రెండో అవతారం వచ్చేసి తారక, తారకాదేవి అవతారం.
శివ పార్వతులు మూడో అవతారం వచ్చేసి బాల భువనేశ్వరుడు, బాల భువనేశ్వరి. ఇక నాలుగో అవతారాలు.. షోడశశ్రీవిద్యేశుడు, షోడశశ్రీవిద్యాదేవి. ఐదో అవతారంలో శివ పార్వతులు.. భైరవుడు, భైరవి. ఆరో అవతారంలో చిన్నమస్తకుడు, చిన్న మస్తకి.. అనంతరం ధూమవంతుడిగా శివుడు, ధూమవతిగా పార్వతీ దేవి అవతారం ఎత్తారు. ఎనిమిదో అవతారంలో శివపార్వతులు బగళాముఖుడు, బగళాముఖి. తొమ్మిదో అవతారంలో శివుడు వచ్చేసి మాతంగుడు, పార్వతీ దేవి మాతంగి. దశావతారంలో శివుడు కమలుడు, పార్వతీదేవి కమలగా జన్మించింది. భక్తులను సంరక్షించేందుకే శివుడు ఇన్ని అవతారాలెత్తాడట. అన్ని అవతారాల్లోనూ ఆయనకు పార్వతీ దేవియే అర్థాంగిగా జన్మించడం విశేషం.