
సూర్య నమస్కారం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడట. ఇక సూర్య నమస్కారాలు చేస్తే ఫలితం ఎలా ఉంటుందో చూడండి. బాడీలో బీభత్సమైన చేంజ్ వచ్చి ఆరోగ్యంగా తయారవుతారు. సూర్య నమస్కారంలో 12 భంగిమలు ఉంటాయి. వాటి పేర్లు: ప్రణమాసనం, హస్త ఉత్తానాసనం, హస్త పాదాసనం, అశ్వ సంచాలనాసనం, చతురంగ దండాసనం, అష్టాంగ నమస్కార, భుజంగాసనం, పర్వతాసనం, అశ్వ సంచాలనాసనం, హస్త పాదాసనం, హస్త ఉత్తానాసనం, ప్రణమాసనం. ప్రతి భంగిమలోనూ మంత్రాలు జపిస్తారు. ఒక్కో మంత్రం ఒక్కో దేవుడికి లేదా సూర్యుడికి సంబంధించినది. ఈ భంగిమలను క్రమ పద్ధతిలో చేయడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయి.
సూర్య నమస్కారంలోని 12 భంగిమలు:
1. ప్రణమాసనం: నమస్కార భంగిమలో నిలబడటం
2. హస్త ఉత్తానాసనం: చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం.
3.హస్త పాదాసనం: ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.
4. అశ్వ సంచాలనాసనం:కుడి కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం.
5. చతురంగ దండాసనం : శరీరాన్ని నేలమీదకు దించి, చేతులతో బ్యాలెన్స్ చేయడం.
6. అష్టాంగ నమస్కారాసన్ : శరీరాన్ని నేలమీదకు దించి, 8 భాగాలు (రెండు పాదాలు, రెండు చేతులు, రెండు మోకాళ్లు, ఛాతీ మరియు గడ్డం) నేలను తాకడం.
7. భుజంగాసనం: పాముల వలె శరీరాన్ని పైకి లేపడం.
8. పర్వతాసనం: పర్వతం ఆకారంలో శరీరాన్ని పైకి లేపడం.
9. అశ్వ సంచాలనాసనం: ఎడమ కాలును వీలైనంత వెనుకకు చాచి, మోకాలు నేలకు తాకకుండా ఉంచడం.
10. హస్త పాదాసనం: ముందుకు వంగి, చేతులతో పాదాలను తాకడం.
11. హస్త ఉత్తానాసనం: చేతులు పైకెత్తి, శరీరాన్ని కొద్దిగా వెనుకకు వంచడం.
12. ప్రణమాసనం: నమస్కార భంగిమలో నిలబడటం.
