శ్రీ మహాలక్ష్మి తల్లిదండ్రులు, తమ్ముడు, కోడలి గురించి తెలుసా?

శ్రీ మహాలక్ష్మి ఇంట ఉందంటే సంపదకు ఎలాంటి లోటూ ఉండదంటారు. ఈ క్రమంలోనే అమ్మవారిని ఇంటనే నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తులసి మొక్క లక్ష్మీదేవి రూపం కాబట్టి నిత్యం ఉదయం లేవగానే తులశమ్మను పూజించుకున్న తరువాతనే ఇతర పనుల్లోకి వెళతారు. అయితే శ్రీ మహాలక్ష్మి వివిధ రూపాలు ఆమె గోత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి మన అందరి దైవం. ఆమె గోత్రం ‘భార్గవ’. అమ్మవారి తల్లి పాల సముద్రం, తండ్రి భృగుమహర్షి, తమ్ముడు చంద్రుడు, కోడలు సరస్వతి, భర్త శ్రీహరి.

ఇక పుత్రులు వచ్చేసి ఆనందుడు, కర్దముడు, చకితుడనే ముగ్గురు ఋషులు. కృతయుగంలో ఈమె పేరు శ్రీ మహాలక్ష్మి, భర్త శ్రీహరి. త్రేతాయుగంలో ఈమె పేరు సీత, భర్త శ్రీరామచంద్రుడు. ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణి, భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు. కలియుగం లో ఈమె పేరు అలర్మేర్ మంగ(అలర్- పుష్పాల యొక్క, మేర్ – పై భాగంలో కన్పిస్తూ దర్శమిచ్చిన, మంగ – కన్నె. ఈమె పేరే పద్మావతి. పద్మాలలో దాగి పుట్టినది) ఈమెనే’ అల మేలు మంగ అన్నారు. భర్త శ్రీ వేంకటేశ్వరుడు. కృతయుగంలో వైకుంఠంలో, త్రేతాయుగంలో అయోధ్య, ద్వాపరయుగంలో మధుర, కలియుగములో తిరుమల అమ్మవారి నివాసము.

Share this post with your friends