శివుడి దశావతారాల గురించి తెలుసా?

విష్ణుమూర్తి దశాతరాల గురించి మనకు తెలుసు. ధర్మ సంస్థాపన, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం పది అవాతారాలను ఎత్తాడు. ఎప్పుడూ మనం విష్ణు మూర్తి గురించే చెప్పుకుంటూ ఉంటాం కానీ మరో భగవంతుడు ఎవరూ ఇన్ని అవతారాలు ఎత్తాడని చెప్పుకోం కాబట్టి చాలా మందికి తెలియదు. వాస్తవానికి శివుడు కూడా దశావతారాలను ఎత్తాడు. ఈ దశావతారాల ప్రస్తావన శివ మహా పురాణంలో ఉంటుంది. శివుడు తన మొదటి అవతారంలో మహాకాలావతారం ఎత్తాడు. అప్పుడు పార్వతీదేవి మహాకాళిగా అవతరించింది. శివుడి రెండో అవతారం తార్ అవతారం. అప్పుడు పార్వతీదేవి తారగా జన్మించింది. శివుడి మూడవ అవతారం బల భువనేశుడు.. పార్వతీమాత బాల భువనేశ్వరిగా జన్మించింది.

నాలుగో అవతారం శ్రీషోడషశ్రీవిద్యేశుడు కాగా.. ఈ అవతారంలో అమ్మవారు శ్రీషోడషశ్రీవిద్యాదేవిగా జన్మించింది. ఐదో అవతారంలో పరమశివుడు భైరవుడి అవతారమెత్తగా… అమ్మవారు భైరవి అవతారమెత్తింది. ఆరో అవతారంలో శివుడు చినమస్తకుడిగానూ… ఈ అవతారంలో అమ్మవారు చినమస్తకిగా అవతరించింది. ఏడో అవతారంలో శివుడు ధూమవంతుడుగానూ.. పార్వతీదేవి ధూమావతిగానూ అవతారమెత్తింది. ఎనిమిదో అవతారంలో బగలాముఖుడుగానూ.. పార్వతీదేవి బగలాముఖిగా వెలిసింది. తొమ్మిదో అవతారంలో శివుడు మాతంగుడు గానూ.. ఈ అవతారంలో అమ్మవారు మాతంగి పేరుతో అవతారమెత్తింది. దశావతారంలో శివుడు కమలుడుగానూ.. అమ్మవారు కమలగానూ అవతారం ఎత్తింది.

Share this post with your friends