శివ పంచాక్షరీ మంత్రం గురించి తెలుసా? ప్రతిరోజూ జపిస్తే ఫలితం అద్భుతం..

ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉరుకులు పరుగులు పెట్టకుంటే కుదరదు. రోజువారీ జీవితంలో ఒత్తిళ్లను అధిగమించాలని ఎవరికి ఉండదు? దీనికోసం ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరూ యోగా లేదంటే ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్నారు. ఈ మార్పు మంచిదే. ఒత్తిడి జయించాలంటే మనకు బాగా ఉపయోగపడే మంత్రం ‘ఓం నమ:శివాయ’. ఈ శివ మంత్రం మనల్ని ఒత్తిడి నుంచి మాత్రమే కాకుండా శుద్ధి, ఆత్మ విముక్తి కోసం ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని పఠించినా.. విన్నా జీవితంతో పాజిటివిటీ పెరుగుతుంది. ఈ మంత్రాన్ని శివ పంచాక్షర మంత్రం అని కూడా పిలుస్తారు. ఇది ఐదు అంశాలకు చిహ్నమట.

ఈ శివ పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల వ్యక్తి నుంచి ఎన్నో కష్టనష్టాల నుంచి బయటపడతామట. అలాగే మోహము, క్రోధము, ద్వేషము, మోహము, దురాశ, భయము, నిస్పృహలు తొలగిపోయి వాటి స్థానంలో ధైర్యం, ఉత్సాహం పెంపొందుతాయట. అపమృత్యు భయం కూడా ఉండదట. ఈ మంత్రం జపించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయం చాలా మంచిది. అలా కాకున్నా రోజులో ఎప్పుడు పఠించినా మంచిదేనట. ఇక ఈ మంత్ర ఫలితం దక్కాలంటే రోజులో 108 సార్లు జపించాలట. ఇక ఈ మంత్రాన్ని జపించడం అలవాటు చేసుకోండి. వచ్చే ఫలితాన్ని మీరే చూడండి.

Share this post with your friends