పాండవతీర్థం గురించి తెలుసా? దీనిలో స్నానమాచరిస్తే ఏం జరుగుతుందంటే..

పరమ పవిత్రమైన తిరుమల గిరులు ఎన్నో విశేషాలకు నెలవు. ఈ తిరుమల గిరులలో ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి. తిరుమలకు వెళ్లినప్పుడు ఒకట్రెండు తీర్థాలను దర్శించుకునే ఉంటారు. కానీ ఇక్కడ చాలా తీర్థాలున్నాయి. వాటిలో ొక్కో దానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. దాని గురించి మనకు తెలియదు. తిరుమల పరిసర ప్రాంతాలలో ఉన్న ఓ పుణ్య తీర్థంలో స్నానం చేస్తే విజయాలు ప్రాప్తిస్తాయని అంటారు. ఈ కథనంలో ఆ తీర్థ విశేషాలను తెలుసుకుందాం.

తిరుమల శ్రీ మలయప్పస్వామి కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశంలోని భక్తులు అత్యంత ఎక్కువగా దర్శించుకునే పుణ్యక్షేత్రం కూడా ఇదే. ఇది ఎన్నో తీర్థాల సమాహారం. తిరుమల పరిసర ప్రాంతాలలో ‘కుమారధార తీర్థం’ ‘సనక సనందన తీర్థం’, ‘తుంబుర తీర్థం’. ‘జాబాలీ తీర్థం’, ‘పాపనాశన తీర్థం’, ‘పాండవ తీర్థం’ ఇలా ఎన్నో పవిత్ర తీర్ధాలున్నాయి. వీటిలో ప్రతి ఒక్కదానికి ఒక్కో ప్రాధాన్యత ఉంది. తిరుమల గిరులలో వెలసిన పాండవ తీర్థంలో స్నానమాచరిస్తే సమస్త పాపాలు నశిస్తాయట. అంతేకాకుండా మనం చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుందని వేంకటాచల మహాత్యం వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.

Share this post with your friends