దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువైన కమండల గణపతి గురించి తెలుసా?

మన దేశంలోని ప్రతి గ్రామంలోనూ సర్వ విఘ్నాలకు అధిపతి అయిన వినాయకుడి ఆలయం ఉంటుంది. వీటిలో కొన్ని ఆలయాలు చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. కొన్ని ఆలయాలు ఆధ్యాత్మిక కథలతో ముడిపడి ఉన్నాయి. అలాంటి గణపతి ఆలయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం చిక్కమంగళూరు జిల్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతంలో కేసవే అనే గ్రామంలో కమండల గణపతి ఆలయం ఉంది. ఈ ఆలయం ఈనాటిది కాదు.. వెయ్యి సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు.

పార్వతీదేవి శని దోషాన్ని తొలగించుకునేందుకు ఇక్కడ గణేశుడిని ప్రతిష్టించి ముందుగా ఆయనకు పూజ నిర్వహించిందని చెబుతారు. కాబట్టి శని దోషాన్ని తొలగించే గణేశుడిగా ఇక్కడి స్వామివారిని భక్తులు కొలుస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు గణేశుడికి పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఆలయం మూసివేస్తారు. అయితే సంకష్టి రోజున (చంద్ర క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల కృష్ణ పక్షంలో నాల్గవ రోజున ఒక ప్రత్యేక రోజు) ఒక ప్రత్యేక రాత్రి పూజను నిర్వహిస్తారు. అలాగే గణేష్ చతుర్థి నాడు సైతం ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. దీనికి వందలాది మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తారు.

Share this post with your friends