జంబుకేశ్వర ఆలయం గురించి తెలుసా?

పరమ పవిత్రమైన కార్తిక మాసంలో ప్రతి ఒక్కరూ శివుడిని పూజించుకుంటారు. ఈ మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైనదని చెబుతారు. మరో రెండు రోజుల్లో కార్తీక మాసం ముగియనుంది. కాబట్టి మనం ఒక ఆలయం గురించి తెలుసుకుందాం. పంచభూత లింగ క్షేత్ర దర్శనంలో భాగంగా జల లింగమైన జంబుకేశ్వర క్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అసలు జంబుకేశ్వర క్షేత్రం ఎక్కడుందో తెలుసుకుందాం. జంబుకేశ్వర క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లి పట్టణానికి 11 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జంబుకేశ్వర స్వామివారు స్వయంగా వెలిశారని ప్రతీతి.

జంబుకేశ్వరానికి మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. అవేంటంటే.. తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే ఈ క్షేత్రం ఏనుగులతో పూజలందుకుంది. కాబట్టి ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే తెల్ల నేరేడు వృక్షాలు బాగా ఉండేవట. అందుకే ఈ ప్రాంతానికి జంబుకేశ్వరం అని పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని సా.శ.11వ శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారట. శాసనాల ప్రకారం చోళ రాజుల తరువాత ఆలయ నిర్వహణను పల్లవ రాజులు, పాండ్యులు, విజయనగర రాజులు పర్యవేక్షించారు. స్వామివారికి నిత్య పూజాధికాలు, దీపధూపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేశారట.

Share this post with your friends