గాంధారి వాన గురించి తెలుసా?

వర్షాకాలం కారణంగా ప్రస్తుతం బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మీకు ఎన్ని రకాల వర్షాలు ఉన్నాయో తెలుసా? ఎప్పుడూ ఒకే‌ వాన కురిస్తే ఎలా? ఇన్ని రకాల వానలు కురిస్తే? ఇంతకీ ఎన్ని రకాలంటారా? అది తెలిస్తే షాక్ అవుతారు. ఇన్ని రకాల వానలున్నాయా? అని ఆశ్చర్యపోతారు. ముందుగా తెలుసుకుందాం.
గాంధారి వాన – కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన
మాపుసారి వాన – సాయంత్రం కురిసే వాన
మీసరవాన – మృగశిరకార్తెలో కురిసే వాన
దుబ్బురువాన – తుప్పర/తుంపర వాన
సానిపి వాన – అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
సూరునీల్ల వాన – ఇంటి చూరు నుంచి ధార పడేంత వాన
బట్టదడుపు వాన – ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
తెప్పెవాన – ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
సాలు వాన – ఒక నాగలిసాలుకు సరిపడా వాన
ఇరువాలు వాన – రెండుసాల్లకు, విత్తనాలకు సరిపడా వాన
మడికట్టు వాన – బురద పొలం దున్నేటంత వాన
ముంతపోత వాన – ముంతతోటి పోసినంత వాన
కుండపోత వాన – కుండతో కుమ్మరించినంత వాన
ముసురు వాన – విడువకుండా కురిసే వాన
దరోదరి వాన – ఎడతెగకుండా కురిసే వాన
బొయ్య బొయ్య గొట్టే వాన – హోరుగాలితో కూడిన వాన
రాళ్ల వాన – వడగండ్ల వాన
కప్పదాటు వాన – అక్కడక్కడా కొంచెం కురిసే వాన
తప్పడ తప్పడ వాన – టపటపా కొంచెంసేపు కురిసే వాన.
దొంగ వాన – రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
కోపులు నిండే వాన – రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
ఏక్దార వాన – ఏకధారగా కురిసే వాన
మొదటివాన – విత్తనాలకు బలమిచ్చే వాన
సాలేటి వాన – భూమి తడిసేంత భారీ వాన
సాలు పెట్టు వాన – దున్నేందుకు సరిపోయేంత వాన

Share this post with your friends