
ప్రపంచంలో తొలి వివాహం ఎక్కడ జరిగిందనేది నిజంగా చాలా ఆసక్తికరమే. హిందూ సంతాన ధర్మంలో వివాహం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఎక్కడ? ఎవరికి? ఎప్పుడు జరిగింది? అనేది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మందికి మాత్రమే తెలుసు. ఆ వివరాలను మనం కూడా తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని హిందువులు పవిత్రంగా భావించే నగరం హరిద్వార్. ఈ హరిద్వార్‌లోని పురాతన నగరమైన కంఖాల్‌లో దక్షేశ్వర మహాదేవ ఆలయం ఉంది. ఈ ఆలయ ప్రాంతంలోనే తొలి వివాహం జరిగింది. సత్యయుగంలో ఈ ఆలయాన్ని ప్రతిష్టించారని అక్కడి వారు చెబుతుంటారు.
ఈ ఆలయ పూజారి మహంత దిగంబర స్వామి విశ్వేశ్వర పూరీ మహారాజ్ ప్రపంచంలో తొలి వివాహం చేసుకున్న జంట గురించి ఆసక్తికర విషయాలను తెలిపారు. ప్రపంచంలోనే మొదటి వివాహం శివపార్వతులదని ఆయన వెల్లడించారు. ఇక వీరి వివాహం సృష్టి ప్రారంభంలో జరిగిందని తెలిపారు. ఆ వివాహ రాత్రినే మనం శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటామని చెప్పారు. కంఖాల్‌లో ఉన్న దక్షేశ్వర మహాదేవ ఆలయం శివుని అత్తమామల ఇల్లు. శివపార్వతులది విశ్వంలోనే మొదటి వివాహం కాగా.. కంఖాల్‌లో మహాదేవ ఆలయం మొదటి వివాహ వేదిక అట. మరో విశేషం ఏంటంటే.. ఇది విశ్వంలోని మొట్టమొదటి స్వయం భూ శివలింగం.
