
దేవాలయాల్లో మూలవిరాట్టు ఉండే మండపం గొప్పది. అందులో కూడా గర్భాలయం ప్రశస్తము, పవిత్రము. గర్భాలయంలో మూలవిరాట్టుని నాలుగు గోడల మధ్యగా, అన్నీ గోడలకు సమానమైన దూరములో ఉండేలా ప్రతిష్ట చేయరు. వెనుక వున్న గోడ దగ్గరగా మూలవిరాట్టుని ప్రతిష్టిస్తారు. నిత్యం మంత్రాలని పఠిస్తూ, పూజాది కార్యక్రమాలు, స్వామికి చేస్తున్న కారణంగా, ఆ భగవంతుని పాదపీఠం క్రిందవుండే యంత్రంలోనికి, ఈ మంత్ర శక్తి ప్రవేశించి, ఆ విగ్రహానికి, ఓ ఆకర్షణ ఏర్పడుతుంది. ఈ కారణంగానే వేలు, లక్షలు వెచ్చించి, నిద్రాహారాలను లెక్కించక జనమంతా భగవంతుణ్ణి చూడ్డానికి వస్తారు.
అలాంటి మంత్ర శక్తి కారణంగా భగవంతుని విగ్రహం, తననుంచి కొన్ని తపః కిరణాలని నాలుగు దిక్కులా వెదజల్లుతూ ఉంటుంది. ఆ శక్తిని గ్రహించడానికి మనం విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము. ఈ మంత్రశక్తిని గ్రహించగల నాలుగు గోడలలోనూ స్వామికి మరింత చేరువగా ఉండేది, వెనుక గోడే. అందుకే ఆ గోడ మీద ఒక శిల్పాన్ని చెక్కుతారు. ఎందుకంటే, భక్తుడు ఆగినప్పుడు, తపశ్శక్తి ప్రవేశిస్తుందని, పక్షులకు కూడా ఉత్తమ జన్మ రావాలనే ఉద్దేశ్యముతో, వాటి తిండి కోసం బలి పీఠాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ విధముగా పక్షులకు ఆహారము పెట్టడము, హిందువుల సంప్రదాయము.
