
హిందూమతంలో దానాన్ని చాలా గొప్పగా పరిగణిస్తారు. ఏదైనా ప్రత్యేక సందర్భంగా ఉపవాసంతో పాటు దానానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. దానం చేయడం వల్ల పరోపకార భావనే కాకుండా మనకు చాలా మంచి జరుగుతుందట. మానసిక ప్రశాంతత, సంతృప్తితో పాటు దైవానుగ్రహం కూడా ఉంటుందని అంటారు. అన్నదానం, వస్త్ర దానం వంటివి మనకు తెలిసిందే. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడని వస్తువులు కొన్ని ఉన్నాయి. అవేంటో మీకు తెలుసా? ఒకసారి చూద్దాం.
చీపురు : మనం ఇంట్లో వినియోగించే చీపురుని ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదట. చీపురు లక్ష్మీదేవితో సమానం కాబట్టి మనం మురికి చీపురును దానం చేస్తే లక్ష్మీదేవి మన ఇంటి నుంచి పోతుందని అంటారు. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవల్సి ఉంటుందట.
ఆహారం : అన్నదానం మంచిదే కానీ మిగిలిపోయిన ఆహారాన్ని దానం చేయూడదని అంటారు. రాత్రి మిగిలిపోయిందని పొద్దునో.. లేదంటే పొద్దున మిగిలిందని రాత్రో దానం చేయకూడదట.
వాడిన నూనె : శని దోషం ఉన్నవారు నువ్వుల నూనెను దానం చేస్తారు. అది చాలా మంచిది. అయితే ఆ నూనె ఒకసారి వాడినదో లేదంటే పాడైపోయిందో అయి ఉండకూడదట.
పాత్రలు : ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ పాత్రలను దానం చేయకూడదట. వీటిని దానం చేస్తే ఇంట్లో సంతోషం పోయి.. వ్యాపారాలు కూడా దెబ్బతింటాయట.
కత్తి, కత్తెర : కత్తి, కత్తెర వంటి పదునైన వస్తువులను దానం చేయకూడదట. ఇలా చేస్తే ఇచ్చిన వారికి.. పుచ్చుకున్న వారికి మధ్య విభేదాలు తలెత్తుతాయట.
