ఉదయాన్నే లేస్తే ఏమాత్రం బద్దకంగా అనిపించదు. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. లేదు లేటుగా లేచామంటే ప్రతి పనీ లేటుగా అవుతూ చాలా నీరసంగా అనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఇక ఏ సమయంలో లేచినా కూడా చూడకూడని వస్తువులైతే కొన్ని ఉంటాయి. వాటి కారణంగా అశుభ ఫలితాలు.. నెగిటివ్ ఎనర్జీ వంటివి దరి చేరుతాయి. ఇంతకీ ఆ వస్తువులేంటంటారా? నీడను అస్సలు చూడకూడదట. ముఖ్యంగా మన నీడ కానీ ఇతరుల నీడ కానీ చూడకూడదట. దీని వల్ల చాలా ఇబ్బందులు తలెత్తుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.
అలాగే వంటింట్లో మురికిగా ఉన్న పాత్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ చూడకూడదట. ఇలా చూడటం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలు.. తద్వారా మనం పేదరికాన్ని సైతం ఎదుర్కోవాల్సి వస్తుందట. కాబట్టి ఎప్పటికప్పుడు వంట పాత్రలను శుభ్రపరుచుకోవాలట. ఇక మనం చేసే పెద్ద తప్పు లేవగానే అద్దం చూసుకోవడం. ఇలా అస్సలు చేయకూడదట. మనలో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోయి ఉత్సాహం అటకెక్కుతుందట. మనం ఉదయం లేచిన అనంతరం ఫేస్ వాష్ చేసుకున్నాక అద్దం చూసుకుంటే ఇబ్బంది లేదట. కాబట్టి పైన చెప్పుకున్న ఏ పనిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదట.