పోలాల అమవాస్య ఎప్పుడో తెలుసా?

ఉత్తరాది వారు, దక్షిణాది వారు మాసాలను కాస్త భిన్నంగా చూస్తారు. పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి తిధి నుంచి మొదలై పౌర్ణమి తిథితో ఉత్తరాది వారు నెలలను చూస్తారు. దక్షిణాది వారికి నెలలు అమావాస్య తిథి తర్వాత వచ్చే పాడ్యమి తిథితో మొదలై అమావాస్యతో ముగుస్తాయి. ఈ లెక్కన శ్రావణ మాసం చివరి రోజైన అమావాస్య సెప్టెంబర్ 3న వచ్చింది. దీనిని పోలాల అమావాస్య లేదంటే సోమవతి అమావాస్య అని పిలుస్తారు. పోలాల అమావాస్య రోజున పెద్దలకు పిండ ప్రదానం చేస్తారు. దీంతో పూర్వీకులు మోక్షం పొందుతారని పండితులు చెబుతారు. పిండ ప్రదానం చేసిన వారికి కూడా పితృ దోషం నుంచి విముక్తి లభిస్తుందట.

అమావాస్య తిథి సెప్టెంబర్ 3వ తేదీ ఉదయం 5.21 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 7.24 గంటలకు ముగుస్తుంది. కాబట్టి సెప్టెంబర్ 3న మొత్తం అమావాస్య ఘడియలుండటంతో పోలాల అమావాస్యను ఈ రోజే జరుపుకుంటాం. ఈ రోజున పూర్వీకులకు పిండ ప్రధానాలు చేస్తారు. పోలాల అమావాస్య రోజున సూర్యోదయం సమయంలో పూర్వీకులకు పిండ ప్రదానం చేయడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. కొందరికి పిత్ర దోషం తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది. వారు పండితుల సలహా తీసుకుని దాని ప్రకారం పిండ ప్రదానం చేస్తే మంచింది.

Share this post with your friends