
యుగాంతం గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. అయితే యుగాంతం గురించి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి సౌమ్యనాథ ఆలయం. ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరు మండల కేంద్రంలో సౌమ్యనాథస్వామి దేవాలయం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్నాం. సౌమ్యనాథ ఆలయంలోని రాతి చేప గురించి కూడా తెలుసుకున్నాం. ఈ రాతి చేప కూడా యుగాంతం గురించి చెబుతుందని అక్కడి వారి నమ్మకం. సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో అంతర్భాగంలో పైన ఒక రాతిపై చేప ఆకారాన్ని శిల్పంగా చెక్కారు.
ఈ చిన్న రాతి చేపకు పెద్ద చరిత్ర ఉందని పురాణాలు చెబుతున్నాయని ఇక్కడి వేద పండితులు చెబుతారు. వారి కథనం ప్రకారం.. భవిష్యత్తులో భారీ వరదల కారణంగా ఆలయంలోకి పెద్ద ఎత్తున నీరు చేరే అవకాశం ఉంది. ఈ నీటి కారణంగా చేపను తాకిన వెంటనే దానికి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని పురాణాల్లో ఉందని వేద పండితులు చెబుతున్నాయి. అప్పుడు ఈ కలియుగం అంతమవుతుందని స్థల పురాణం చెబుతోంది. ఇంతకీ చేపకు జీవం వస్తుందా.. కలియుగం అంతమవుతుందా అనేది శాస్త్రీయం. ఇది ఏమైనా కలియుగ అంతంపై అనేక పురాణాలు ఉన్నాయి.
