ముంబైలో రూ.2.5 లక్షల విలువైన డైమండ్ రాఖీ.. వాటి ప్రత్యేకతేంటంటే..

ఇప్పుడంటే రకరకాల రాఖీలు వస్తున్నాయి కానీ అప్పట్లో రాఖీలను ఎలా తయారు చేసేవారో తెలుసా? వాటిని చేతిపనుల కళాకారులు తయారు చేసేవారు. అప్పట్లో రాఖీలు బంగారం, వెండి, ఇతర ఖరీదైన రాళ్లతో తయారు చేసేవారు. ఇప్పుడు అంతరించే దశలో ఉన్న చేతి వృత్తికి తిరిగి బనారస్‌లో పూర్వ వైభవం కల్పించారు. ఈ రాఖీలను గులాబీ రంగు మీనాకారీతో తయారు చేస్తారు. వీటికి తిరిగి భారీ డిమాండ్ ఏర్పడింది. దాదాపు మూడు కోట్ల రూపాయలతో 25 వేలకు పైగా రాఖీలను తయారు చేయడం జరిగింది.

వీటిని మన దేశంలోనే కాకుండా విదేశాలకు సైతం పంపించడం జరిగింది. ఐరోపా, అమెరికా దేశాల్లో ఈ రాఖీలకు విపరీతమైన డిమాండ్ వచ్చిందట. వెండి రేకుపై బంగారం, ఖరీదైన రాళ్లను ఉపయోగించి ఈ రాఖీలను డిమాండ్‌కు అనుగుణంగా తయారు చేస్తారు. పేర్లు, ఖరీదైన రాళ్లతో ఈ రాఖీలను తయారు చేస్తుండటంతో దీనిని విపరీతంగా ఇష్టపడతారు. ఇక ఈ రాఖీలో ఉపయోగించే రాళ్లలో రూబీ, పుష్యరాగం, నీలమణితో అలంకరిస్తారు. దాదాపు రూ.2.5 లక్షల విలువైన డైమండ్ రాఖీని ముంబైకి చెందిన ఓ వ్యాపారి తయారు చేశాడు. అయితే రాఖీ పండుగ అనంతరం చెవి రింగులు గానూ.. బ్రాస్‌లెట్‌లు‌గానూ ఉపయోగిస్తారు.

Share this post with your friends