శ్రావణ మాసం సందర్భంగా అమ్మవార్లను అందంగా అలంకరించారు. ఒక గ్రామంలోని అమ్మవారిని ఏకంగా రూ.20 లక్షల రూపాయలతో అలంకరించారు. ఆ అమ్మవారు మరెక్కడో కాదు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామ దేవతైన శ్రీ ముసలమ్మ అమ్మవారిని కరెన్సీ అమ్మవారిగా అలంకరించారు. 5 రోజులు పాటు 10 మంది ఆలయ కమిటీ సభ్యులు శ్రమించి అమ్మవారిని రూ.20 లక్షలతో అలంకరించారు. ఇక అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగాణాన్ని రూ.10 నుంచి రూ.500 నోట్లతో ఆధ్వర్యంలో రూ.20 లక్షలతో అలంకరించారు.
ఇక నిన్న తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, వ్రతాలను ఆలయంలో నిర్వహించారు. అమ్మవారిని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ అమ్మవారికి ఆరున్నర దశాబ్దాల ఘన చరిత్ర ఉంది. భక్తులు కోరిక కోర్కెలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారిని భక్తులు కొలుస్తున్నారు. పదేళ్ల క్రితం నుంచి ఈ అలంకరించడం ప్రారంభమైంది. అయితే పదేళ్ల క్రితం ఐదు లక్షలతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఇప్పుడు అది రూ.20 లక్షలకు చేరుకుంది. శ్రావణ మాసమంతా ఈ ఆలయంలో సందడి నెలకొంటుంది.