హైదరాబాద్‌లో గణేష్ నిమర్జనానికి పూర్తైన ఏర్పాట్లు..

గణేష్ శోభాయాత్ర, నిమర్జనోత్సవం రేపు జరుగనుంది. దీనిని తెలంగాణ ప్రభనుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ గణేష్ నిమర్జనం హుస్సేన్‌సాగర్‌తో పాటు మరో ఐదు పెద్ద చెరువులు, 73 కొలనుల్లో జరగనుంది. గణేష్ నిమర్జనం సమయంలో ఇబ్బంది కలగకుండా చూసేందుకుగానూ.. అలాగే ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు స్పెషల్ టీమ్స్‌ను ప్రభుత్వం రంగంలోకి దింపింది.

జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లు.. బహుదూర్‌పురా మీరాలం చెరువు, సరూర్‌నగర్‌ చెరువు, కాప్రా ఊర చెరువు, జీడిమెట్ల ఫాక్స్‌ సాగర్‌ చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇక వినాయక నిమజ్జనం కోసం 140 పెద్ద క్రేన్లు, 295 మొబైల్ క్రేన్స్‌, 102 మినీ టిప్పర్స్, 125 జేసీబీలను అధికారులు సిద్ధంచేశారు. 160 గణేష్‌ టీమ్స్‌ అల్రెడీ యాక్షన్‌లోకి దిగాయి. గణేష్ బందోబస్తు కోసం 20 వేల మంది పోలీసులను అధికారులు రంగంలోకి దింపారు. హైదరాబాద్‌లో లక్షకు పైగా గణపతి విగ్రహాలను పెట్టారు. వీటిలో ఇప్పటికే 70 వేల విగ్రహాల నిమర్జనం చేసేశారు. చివరి రోజున 30 వేల విగ్రహాలను నిమర్జనం చేయనున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రత్యకేకంగా సీసీ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు.

Share this post with your friends