వైభవోపేతంగా రఘునాయక స్వామి కల్యాణం

నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) : నయనానందకరం.. జానకీరాముల కల్యాణం. చదలవాడలోని శ్రీసీతా లక్ష్మణ సమేత రఘునాయక స్వామి ఆలయంలో 239వ వార్షిక కల్యాణ మహోత్సవాల్లో భాగంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ వైభవోపేతంగా సీతారాముల కల్యాణం. కల్యాణం అనంతరం తలంబ్రాల సమయంలో ఆకాశంలో విహరించిన గరుడపక్షులు. అంగరంగ వైభవంగా దశరథ తనయుడి రథోత్సవం.

Share this post with your friends