హనుమంతుడికి సంబంధించిన కొన్ని సందేహాలకు సలహాలు..

హనుమాన్ అంటే గట్టివైన దవడలు కలవాడు అనే కాక హను = జ్ఞానం కాబట్టి జ్ఞానవాన్ అని అర్థం. ‘అజ్ఞానమును’ హననము చేయునది కనుక జ్ఞానమునకు హనుమ అని పేరు. హనుమాన్ చాలీసాకు ఆ పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందాం. ఈ స్తోత్రంలో 40 శ్లోకాలు ఉన్నాయి కనుక చాలీసా అని పేరు (చాలిస్ అంటే హిందీ లో 40 అని). హనుమంతుడికి సంబంధించిన 40 శ్లోకాలు కాబట్టి హనుమాన్ చాలీసా అనే పేరు వచ్చింది. ఇక ఆంజనేయ అంటే… సామాన్య కంటితో చూడలేని దానిని చూపించేదే అంజనం, జ్ఞానాంజనం వల్ల మాత్రమే దొరికే పరతత్వం కనుక ఆంజనేయుడు అని పేరు.

హనుమంతుడికి సంబంధించిన కొన్ని సందేహాలకు సలహాలు..
హనుమంతుడికి సంబంధించిన కొన్ని సందేహాలకు సలహాలు..

హనుమాన్ చాలీసాను రాసిన తులసీదాస్ అసలు పేరేంటో తెలుసుకుందాం. ఆయన అసలు పేరు రామ్ బోల. ఎప్పుడూ రామ నామం స్మరిస్తూ వుండడం వల్ల ఆ పేరు వచ్చింది. అలాంటి తులసీ దాస్ 126 సంవత్సరాల పాటు జీవించారని చెబుతారు. హనుమoతుడు బ్రహ్మచారి అని చెబుతారు కదా.. మరి సువర్చల ఎవరు? అంటే.. దేవుళ్ళ భార్యలను, మానవ సంబంధాల దృష్ట్యా చూడరాదు. భార్య అంటే దేవుని విడదీయరాని శక్తి, సూర్యుని వద్ద నేర్చుకున్న విద్యవల్ల వచ్చిన తేజో వర్చస్సు యే “సువర్చల”. ఆ విద్య సూర్యుని దగ్గర నేర్చుకోవడం మూలాన సువర్చల సూర్యుని పుత్రిక అంటారు.

Share this post with your friends