పేరుకే పుష్కర్.. ప్రతి ఏటా ఉత్సవమే..

సృష్టికర్తగా బ్రహ్మదేవుడిని చెబుతారు. అలాంటి బ్రహ్మకు ఈ సమస్త భూమండలంలో ఆలయాలు ఎక్కడా ఉండవు. ఎందుకు ఉండవనే దానికి ఓ కథ ఉంది. దాని గురించి తర్వాత తెలుసుకుందాం. మరి ఆలయం లేని దేవుడనే అసంతృప్తి కొంత మేర హిందువుల్లో తప్పక ఉంటుంది. ఆ లోటును రాజస్థాన్‌ రాష్ట్రంలోని పుష్కర్‌ తీర్చింది. అజ్మీర్‌కి 11 కి.మీల దూరంలో పుష్కర్‌ సరస్సు ఉంటుంది. ఈ సరస్సు ఒడ్డున బ్రహ్మదేవుడికి ఆలయం ఉంది. ఈ సరస్సు పేరు మీదుగానే ఈ పట్టణానికి పుష్కర్ అనే పేరు వచ్చింది.

పుష్కరం అంటే 12 ఏళ్లు. పుష్కరాలు సైతం 12 ఏళ్లకోసారి జరుగుతాయన్న విషయం మనకు తెలిసిందే. మరి ఆ పేరున్న పుష్కర్‌లో మాత్రం ఉత్సవాలు ఏడాదికోసారి జరుగుతాయి. ఆ కథేంటో తెలుసుకుందాం. రాజస్థాన్ అంటేనే ఎడారి ప్రాంతం. ఎడారి అనగానే మనకు గుర్తొచ్చేది ఒంటెలు. ఇక్కడ ప్రతి ఏటా క్యామెల్ ఫెయిర్ జరుగుతుంది. ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ క్యామెల్ ఫెయిర్‌ను నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో విదేశీయులు హాజరవుతారు. ఇవి ప్రతి ఏటా జరుగుతాయి.

Share this post with your friends