స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయవచ్చా? లేదా?

విష్ణుమూర్తి వేయి నామాల వర్ణనే విష్ణు సహస్రనామం. అయితే దీనిని స్త్రీలు మాత్రం పారాయణం చేయకూడదని చెబుతుంటారు? స్త్రీలు అసలెందుకు విష్ణు సహస్రనామం పారాయణం చేయకూడదు? విష్ణుమూర్తి 1000 పేర్లు స్వామివారి మహిమను వివరిస్తాయి. ఈ పేర్లు పలికినా.. విన్నా కూడా పుణ్యమేనంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు స్త్రీలు విష్ణు సహస్ర నామాలను పఠించకూడదు? విష్ణు సహస్ర నామాల పఠనంలో లింగ భేదం ఎందుకు? అంటే దీనిపై భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. కొందరైతే స్త్రీలు కూడా విష్ణు సహస్రనామం పారాయణం చేయవచ్చని చెబుతున్నారు.

స్వయంగా పార్వతీ దేవి పురాణాలలో విష్ణు సహస్ర నామాన్ని పఠించినట్టుగా ఉందని.. అలాంటప్పుడు ఇతర స్త్రీలు ఎందుకు పఠించకూడదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఓ శ్లోకం మినహాయించి మిగిలినదంతా స్త్రీలు పఠించవచ్చని కొందరు అంటున్నారు. ఆ శ్లోకంలో పార్వతీ దేవి ‘స్త్రోత్తం ఇచ్చామి’ అని పలకకుండా ‘పతితం ఇచ్చామి’ అని పలికిందట. ఈ కారణంతో స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయకూడదని సూచించారు. విష్ణు సహస్ర నామం పారాయణం చేసిన వారికి మాత్రం సంపద వృద్ధితో పాటు గురు దోష నివారణ, ఆత్మవిశ్వాసం పెరగడం వంటివి జరుగుతాయట. ఇక స్త్రీలు విష్ణు సహస్రనామ పారాయణం చేయాలనుకుంటే మాత్రం పండితుల సాయంతో చేయవచ్చట.

Share this post with your friends