పంచముఖ ఆంజనేయుడిని ఇంట్లో పెట్టవచ్చా?

ఆంజనేయుడికి చాలా పేర్లున్నాయి. పవన సుతుడు, వాయుపుత్రుడు అంజనీ సుతుడు, హనుమంతుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే పేర్లున్నాయి. కేసరి అంజనాదేవి దంపతులకు వాయుదేవుని ప్రసాదం కారణంగా శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు జన్మించాడు కాబట్టే.. ఈ పేర్లన్నీ వచ్చాయి. రామ భక్త హనుమంతుడిగానే కాకుండా పాతాళంలో దాచిన రామ, లక్ష్మణులను రక్షించేందుకు పంచముఖి అవతారం దాల్చి పంచముఖ ఆంజనేయుడిగా మారాడు. అసలు హనుమంతుడి ఐదు ముఖాలు దేనికి సంకేతం? ఈ పంచ ముఖాలతో ఉన్న హనుమంతుడి ఫోటోని ఇంట్లో పెట్టవచ్చా? తెలుసుకుందాం.

హనుమంతుడి పంచ ముఖాలు పంచ భూతాలను, ఐదు దిక్కులను సూచిస్తాయని చెబుతారు. ఆంజనేయుడిని పూజిస్తే కార్య సాధనకు బలం, శక్తి, తెలివి తేటలు లభిస్తాయని నమ్మకం. ఆంజనేయుడి రూపాల్లో ఒకటైన పంచముఖి హనుమంతుడిని ఇంటి ముందర పెట్టుకుంటే చాలా మంచిదట. నరదిష్టి ఉన్నా.. ఎలాంటి దిష్టి దోషాలున్నా తొలగిపోతాయట. ఈ స్వామిని పూజించడం వలన చాలా మంచి జరుగుతుందని నమ్మకం. పంచముఖి ఆంజనేయుడిని పూజిస్తే తెలివి తేటలు, బలంతో పాటు మనో ధైర్యం పెరుగుతుందట. తద్వారా సమస్యలను జయిస్తారట.

Share this post with your friends