భగవంతుని ఈ నామస్మరణతో బీపీ, హార్ట్ అటాక్ రాదట..

ఉదయం లేచినప్పటి నుంచి భగవంతుని నామస్మరణ చేసేవారు కొందరుంటారు. ఈ భగవంతుని నామస్మరణ చేయడం వలన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ‘విఠ్ఠల విఠ్ఠల’ అంటూ నిత్యం జపించడం వల్ల బీపీ, హార్ట్ అటాక్‌లు రావట. ఈ పరిశోధనాత్మకంగా నిరూపితమైంది. పుణె లోనివేద విజ్ఞాన కేంద్రం వందలాది హృద్రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది. ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమైంది. విఠ్ఠల అనే పేరులో అపురూపమైన శక్తి ఉంది.

విఠ్ఠల నామ స్పందన అంటే స్వరశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది. ఈ పదాన్ని ఉచ్చరించేటపుడు ‘ఠ్ఠ’ అనే అక్షరం నుంచి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది. రెండు మహాప్రాణాలు, రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్ర తెలిపింది. పది రోజులపాటు , రోజుకు 30 నిమిషాలు శాంత చిత్తంతో మీ ఇష్ట దైవం నామజపం చేసినా హై బ్లడ్ ప్రెషర్‌తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్ర, దివంగత ఇనాందార్ హార్ట్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి.

Share this post with your friends