Black Or White Shiva Linga : నలుపు, తెలుపు రంగు శివలింగాలను పూజిస్తే ఏం జరుగుతుంది?

చాలా మంది ఇళ్లలో శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. అయితే లింగం అనేది అనేక ధాతువులతో తయారవుతూ ఉంటుంది. వాటిలో స్ఫటిక లింగం, మరకత లింగం వంటివన్నీ ఉంటాయి. శివలింగం మనకు దాదాపుగా ఆలయాల్లో నలుపురంగులోనే ఉంటుంది. కానీ ఇళ్లలో మాత్రం రంగురంగుల శివలింగాలు పెట్టుకుంటారు. అసలు ఇంట్లో ఏ రంగు లింగాన్ని పూజించాలి? ఏ రంగు శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ఫలితం లభిస్తుంది? వంటి విషయాలను తెలుసుకుందాం. ముందుగా నలుపు, తెలుపు శివలింగాలను గురించి తెలుసుకుందాం.

Black Or White Shiva Linga
Black Or White Shiva Linga

నలుపు శివలింగం: ఆలయాల్లోనూ.. అలాగే ఇళ్లలో సైతం ఎక్కువగా మనకు నలుపు రంగు శివలింగమే కనిపిస్తుంది. సాధారణంగా నలుపురంగు శివలింగం అనేది నల్ల రాయి, గ్రానైట్ లేదా నర్మద రాయి నుంచి తయారు చేస్తారు. ఈ నలుపు రంగు శివలింగం ప్రతికూల శక్తిని గ్రహించి చాలా మంది నమ్ముతారు. ఇది ఇంట్లో స్థిరత్వాన్ని సృష్టిస్తూ.. కష్ట సమయాల నుంచి గట్టెక్కిస్తుంది. ధైర్యం, మానసిక సమతుల్యత వంటివి నలుపు శివలింగం ఇస్తుందని పండితులు చెబుతారు.

తెలుపు శివలింగం: తెలుపు శివలింగం పరిశుభ్రత, శాంతి, నిశ్శబ్దం, స్పష్టతకు చిహ్నంగా ఉంటుంది. దీనిని సర్వసాధారణంగా తెల్లటి పాలరాతితో తయారు చేస్తారు.

గుర్తింపు: తెలుపు శివలింగం పరిశుభ్రతతో ముడిపడి ఉంది. దీనిని తరచుగా తెల్లటి పాలరాతితో తయారు చేస్తారు. ఇంట్లో ప్రశాంతత కోరుకునేవారు తెలుపు రంగు శివలింగాన్ని ఇంటికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ప్రశాంతత మాత్రమే కాకుండా తెలుపు రంగు శివలింగం ఇంట ఉంటే ఒత్తిడిని తగ్గించి సున్నితమైన శక్తిని తెస్తుంది. ధ్యానం, ఆధ్యాత్మిక వృద్ధి, మానసిక స్థిరత్వం వంటివి తెలుపు శివలింగం తెస్తుంది.

Share this post with your friends