భక్తులకు బిగ్ అలర్ట్.. దీపావళి సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వ తేదిన తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. ఇందుకు సంబంధించి 30వ తేది బుధవారం తిరుమలలో ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ వెల్లడించింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో బారులు తీరారు. ఈ క్రమంలోనే తిరుమల మాడవీధులు గోవిందా నామస్మరణతో మారుమ్రోగాయి. అలిపిరి నుంచి కాలినడక దారి సైతం భక్తులతో సందడిగా మారింది. గల కాలినడక దారి భక్తులతో నిండుగా కనిపిస్తోంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. టీటీడీ అన్ని చర్యలూ చేపట్టింది. క్యూలైన్లలోని భక్తులకు ఎప్పటికప్పుడు ఆహారం, పాలు వంటివి అందించింది.