భక్తిటీవి కోటి దీపోత్సవం : Bhakthi TV Koti Deepotsavam 2024

కార్తికం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవి కోటిదీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు, ప్రవచన కర్తల సందేశాలు, దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభని సంతరిస్తాయి.

ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజలు విచ్చేసిన భక్తుల మనసులను భక్తిపారవశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవి అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో నవంబర్ 9 నుంచి 25వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా జరగనుంది.

Share this post with your friends