రాఖీ పండుగ రోజున భద్ర నీడ.. ఆ సమయంలో రాఖీ కట్టవచ్చా?

శ్రావణ మాసంలో చాలా పండుగలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాఖీ పండుగ. దీనిని శ్రావణ మాసం పౌర్ణమి తిథి నాడు జరుపుకుంటూ ఉంటాం. సోదర, సోదరీమణుల మధ్య ప్రేమతో పాటు ఒకరికొకరు రక్ష అంటూ ఈ రాఖీని కడుతూ ఉంటాం. అయితే రాఖీ కట్టే విషయంలో హిందువులైతే తప్పక సమయాన్ని చూసుకుని కట్టుకుంటూ ఉంటారు. ఈ రాఖీ పౌర్ణమికి భద్ర నీడ ఉంది. కాబట్టి ఆ సమయంలో రాఖీని కట్టరు. భద్ర నీడ సమయంలో రాఖీ పండుగను జరుపుకున్నా లేదంటే భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభంగా భావిస్తూ ఉంటారు.

కాబట్టి రాఖీ పండుగను శుభ సమయం చూసుకుని మాత్రమే సోదర సోదరీమణులు దీనిని జరుపుకోవాల్సి ఉంటుంది. అసలు భద్ర నీడ ఏ సమయంలో వస్తుంది? అంటారా? ఈ ఏడాది రాఖీ పండగ రోజున భద్ర నీడ మధ్యాహ్నం 12.30 గంటల వరకు భద్ర నీడ ఉంటుంది. ఇది పూర్తైన వెంటనే భద్ర నీడ పోదు. దీని ప్రభావం మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోరు. ఈ కారణంగానే ఈ సారి రాఖీ పండుగను మధ్యాహ్నం 1:30 తర్వాత మాత్రమే జరుపుకోవాలి.

Share this post with your friends