హనుమంతుడు అంటే ఇష్టం ఉండదనిది ఎవరికి? అంతా చాలా ఇష్టపడుతూ ఉంటారు. హిందూ మతంలో పవర్‌ఫుల్ గాడ్‌గా ఆంజయనేయుడిని అంతా పేర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా శక్తి, ధైర్యాలతో పాటు జీవితంలోని కష్టాలను తొలగించే దేవుడిగా హనుమంతుడిని పూజిస్తూ ఉంటారు. దేశంలో ఏ మూలకు వెళ్లినా కూడా తప్పక హనుమంతుడి ఆలయం తప్పక ఉంటుంది. మనం ఏ ఆలయంలో అయినా కూడా భజరంగబలిని నిలబడి ఉన్న రూపంలోనూ చూస్తూ ఉంటాం. కూర్చున్నవి కూడా చాలా అరుదుగా కనిపిస్తాయి.
ఇక ఆంజనేయుడి శయన విగ్రహం అయితే అత్యంత అరుదు. అలా శయన హనుమంతుడి ఆలయం ఒకటి ప్రయాగ్ రాజ్‌లో ఉంది. ఇక్కడ హనుమంతుడు పడుకుని ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఈ ఆలయం భారతదేశ రాజధాని ఢిల్లీకి 700 కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్‌లోని అలహాబాద్ నగరంలో సంగం ఒడ్డున ఉంది. ప్రస్తుతం అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్ అని పిలుస్తున్నారు. ఈ ఆలయం బడే హనుమాన్ లేదా బేడీ ఆంజనేయ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి గంగాస్నానం ఆచరించేందుకు రోజూ పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గంగాస్నానం అనంతరం తప్పక ఆ హనుమంతుడి ఆలయాన్ని దర్శిస్తేనే త్రివేణి సంగమంలోని గంగాస్నానం పరిపూర్ణమవుతుందని నమ్మకం.