వినాయక చవితి వచ్చిందంటే చాలు.. జంట నగరాలు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతుంటారు. ఇక పది రోజుల పాటు పూజల అనంతరం గణేష్ నిమజ్జన వేడుకను అత్యంత కోలాహలంగా నిర్వహిస్తూ ఉంటారు. దీనికి ముందు లడ్డూ వేలం పాట ఉత్కంఠగా సాగుతుంది. లడ్డు వేలం పాట అంటే మనకు గుర్తొచ్చేది.. బాలాపూర్ లడ్డూ. బాలాపూర్ లడ్డూ ఈ ఏడాది ఎంత పలుకుంతదనేది ఇవాళ ఉదయం వరకూ ఆసక్తి కొనసాగింది. ఇక ఈ ఏడాది ముందుగా రూ.30 లక్షలు బాలాపూర్ లడ్డూ పలుకుంతుందని అంతా అంచనా వేశారు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగింది.
ఈ ఏడాది బాలాపూర్ లడ్డూని బీజేపీ సీనియర్ నేత కొలను శంకర్‌రెడ్డి దక్కించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల వెయ్యి రూపాయలకు శంకర్ రెడ్డి వేలం పాటను దక్కించుకున్నారు. ఈ లడ్డుని దక్కించుకోవాడానికి చైతన్య స్టిల్స్ అధినేత లింగాల దశరథ్ గౌడ్, సాహెబ్ నగరానికి చెందిన అర్బన్ గ్రూప్ అధినేత ప్రణీత్ రెడ్డి, బాలాపూర్ కి చెందిన బిజేపీ సీనియర్ లీడర్ కొలన్ శంకర్ రెడ్డి, నాదర్గుల్‌కి చెందిన శ్రీ గీతా డైరీ అధినేత లక్ష్మీనారాయణలు వేలం పాటలో పాల్గొన్నారు. ఈ నలుగురు కొత్త నిబంధనకు అనుగుణంగా ముందుగానే రూ.27 లక్షలను డిపాజిట్ చేసి వేలంపాటలో పాల్గొన్నారు. కావాల్సిన డిపాజిట్ కట్టారు. చివరికి శంకర్ రెడ్డి బాలాపూర్ లడ్డూని 30లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నారు.