వినాయకుడిని నిమజ్జన కార్యక్రమానికి ముందు జరిగే అత్యంత కీలక ఘట్టం లడ్డూ వేలం పాట. ముఖ్యంగా బాలాపూర్ లడ్డూ వేలం పాటపై తెలుగు రాష్ట్రాలు ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే.. ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా లడ్డూ వేలం పాట జరుగుతోంది. ఏ ఏటికాఏడు పెరగడమే కానీ లడ్డూ ధర తగ్గడమనేది ఉండదు. రూ.450 తో ప్రారంభమైన లడ్డూ ధర ప్రస్తుతం రూ.27 లక్షలకు చేరుకుంది. 1994లో బాలాపూర్ లడ్డూ వేలం పాట ప్రారంభమైంది. కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది వేలం పాట జరుగుతుంది. బాలాపూర్ లడ్డూ తన రికార్డ్‌ను తానే బద్దలు కొడుతూ ఉంటుంది. రూ. 450లతో మొదలైన వేలం పాట లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది ఎంతకు వెళుతుందోనన్న ఆసక్తి సర్వత్రా చోటు చేసుకుంది. 1994 నుంచి 2001 వరకు బాలాపూర్ లడ్డూ వేలల్లోనే పలికింది. 2002 నుంచి లక్ష రూపాయలకు పైనే ధర పలుకుతూ వస్తోంది.
బాలాపూర్ లడ్డూ ధర ఎంత పలికిదంటే..
1994 – కొలను మోహన్ రెడ్డి – రూ.450,
1995 – కొలను మోహన్ రెడ్డి – రూ.4500,
1996- కొలను కృష్ణారెడ్డి – రూ.18,000,
1997- కొలను కృష్ణారెడ్డి – రూ.28,000,
1998- కొలను మోహన్ రెడ్డి – రూ.51,000,
1999- కళ్లెం ప్రతాప్ రెడ్డి – రూ.65,000,
2000- కళ్లెం అంజిరెడ్డి – రూ.66,000
2001- జి. రఘునందన్ చారి – రూ.85,000
2002- కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000 లక్షలు
2003- చిగురింత బాల్ రెడ్డి – రూ.1,55,00 లక్షలు
2004- కొలన్ మోహన్ రెడ్డి – రూ.2,01,000 లక్షలు
2005- ఇబ్రహీం శేఖర్ – రూ.2,08,000 లక్షలు
2006- చిగురింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000 లక్షలు
2007- రఘునందన్ చారి – రూ.4,15,000 లక్షలు
2008- కొలన్ మోహన్ రెడ్డి – రూ.5,07,000 లక్షలు
2009- సరిత – రూ.5,10,000 లక్షలు
2010- కొడాలి శ్రీధర్ బాబు – రూ.5,35,000 లక్షలు
2011- కొలన్ ఫ్యామిలీ – రూ.5,45,000 లక్షలు
2012- పన్నాల గోవర్థన్ – రూ.7,50,000 లక్షలు
2013- తీగల కృష్ణారెడ్డి – రూ.9,26,000 లక్షలు
2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9,50,000 లక్షలు
2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000 లక్షలు
2016- స్కైలాబ్ రెడ్డి – రూ.14,65,000 లక్షలు
2017- నాగం తిరుపతి రెడ్డి – రూ.15,60,000 లక్షలు
2018- శ్రీనివాస్ గుప్తా – రూ.16,60,000లక్షలు
2019- కొలను రామిరెడ్డి – రూ.17,60,000 లక్షలు
2020 – కరోనా కారణంగా వేలం పాట జరగలేదు
2021 – మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్ రూ.18,90,000 లక్షలు
2022 -వంగేటి లక్ష్మారెడ్డి – రూ.24,60,000 లక్షలు
2023- దయానంద్ రెడ్డి – రూ.27 లక్షలు