బద్రీనాథ్ క్షేత్రం విశిష్టతలేంటంటే..

చార్దామ్ యాత్ర అక్షయ తృతీయ నాటి నుంచే ప్రారంభమైంది. చార్దామ్‌లో నాలుగు ఆలయాల ఒక్కో ప్రత్యేకత ఉంది. హిమాలయాల్లోని ఈ దేవాలయాలను దర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. చార్దామ్‌ క్షేత్రాల్లో చిరుజల్లులు కురుస్తున్నా కూడా భక్తులు ఉత్సాహంగా ఆయా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. వీటి ఒకటైన బద్రీనాథ్‌లో ఒకవైపు భక్తుల సందడి.. మరోవైపు వేద పండితుల మంత్రోచ్ఛరణ మధ్య ఆలయ ప్రధాన తలుపులను తెరిచారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అలరారుతున్న ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు.

అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ క్షేత్రం ఉంది. ఇది శీతాకాలమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి మే నుంచి నవంబర్ వరకూ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. బద్రీనాథ్ ఆలయంలో విష్ణు మూర్తి కొలువై ఉన్నాడు. బద్రీనాథ్ చైనా, టిబెట్ సరిహద్దులకు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉంది. వైష్ణవుల కోసం అంకితం చేయబడిన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి . ఇక్కడ విష్ణుమూర్తి బద్రీ నారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. తొమ్మిదవ శతాబ్దంలో ఆది శంకరులు బద్రీనాథ్‌ను తీర్థయాత్రగా ప్రారంభించారు. ఈ ఆలయంలో మూడు నిర్మాణాలున్నాయి. గర్భగృహ, దర్శన మండపం, సభా మండపం ఉన్నాయి.

Share this post with your friends