శ్రీ కోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో పౌర్ణ‌మి సంద‌ర్భంగా గురువారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 9 నుంచి 10.30 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులకు ఆలయంలో ఆస్థానం నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ సురేష్‌, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుపతిలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా కోదండ రామాలయం విరాజిల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలో ఇది నడుస్తోంది. దేవస్థానం రాకముందు మహంతుల పాలనలో ఉండేది. ధూపదీప నైవేద్యాలతో నిత్యం వేలాదిమంది భక్తులతో కళకళలాడే ఈ ఆలయం తిరుపతి మధ్యలో వెలసిన ఆలయం. ప్రతి సంవత్సరం మార్చి నెలలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. కోదండరామస్వామి ఆలయం మూడు అంతస్థుల రాజగోపురం మీద విజయనగర శిల్పులు అరుదుగా కనిపించే పశ్చిమవైపు ముఖద్వారం, ఆలయం చుట్టూ ఎత్తైన రాతి ప్రహారిగోడ గోపురం దాటి ఆలయమ్లోకి ప్రవేశించగానే బలిపీఠం, ధ్వజస్తంభం, ర్పదాన ఆలయం, గర్భగృహం అంతరాళం ఉంటాయి.

Share this post with your friends