బ్రాహ్మణుడి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన అర్జనుడు..

బ్రాహ్మణుడు తను చేసిన ఒక్క సాయంతో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందాడని తెలుసుకున్నాం కదా. దీంతో ఆశ్చర్యపోయిన బ్రాహ్మణుడు పరుగు పరుగున అర్జునుడి వద్దకు వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు. విషయమంతా బ్రాహ్మణుడి ద్వారా తెలుసుకున్న అర్జనుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కృష్ణుడుితో తాను ఎంతో అమూల్యమైన స్వర్ణ నాణేలు, వజ్రం ఇచ్చినా అతని దశ తిరగలేదు. కానీ నీవు ఇచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని ఎలా మలుపుతిప్పాయని ప్రశ్నించాడు. అప్పుడు కన్నయ్య.. అతని వద్ద ఎక్కువగా బంగారం, ఖరీదైన వజ్రం ఉన్నప్పుడు తన అవసరాల గురించి మాత్రమే ఆలోచించాడు.

అదే రెండు బంగారు నాణేలున్నప్పుడు మరో జీవి కష్టం గురించి ఆలోచించాడు. నిజానికి దేవుడు చేయాల్సిన పనిని బ్రహ్మణుడు చేశాడు. కష్టంలో ఉన్న ప్రాణి బాధను తగ్గించాలనుకున్నాడు. అందుకే అతని బాధను తాను తగ్గించానని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఒక చిన్న సంఘటనతో గొప్ప సందేశాన్నిచ్చాడు శ్రీకృష్ణుడు. మానవుడు స్వార్థాన్ని వీడితే పరోపకార బుద్ధిని అలవరుచుకుంటే అతని శ్రేయస్సును భగవంతుడే చూసుకుంటాడని ఒక బ్రాహ్మణుడి కథ ద్వారా కన్నయ్య చెబుతున్నారు. స్వార్థమే మన అన్ని కష్టాలకు కారణమని.. దానిని వీడితే మన జీవితం ఆనందంగా ఉంటుందని వాసుదేవుడు చెప్పకనే చెప్పాడు.

Share this post with your friends