వేదాలు, పురాణాలను పరిశీలిస్తే కొన్ని విషయాలు ఆసక్తికరంగానూ, ఆశ్చర్యంగానూ అనిపిస్తాయి. విస్తుగొలిపే విషయాలు సైతం కొన్ని ఉంటాయి. ఒక యుగానికి, మరో యుగానికి అనుసంథానం కలిగి ఉంటాయి. కురుక్షేత్ర సంగ్రామం జరిగిందేమో ద్వాపర యుగంలో.. అయితే ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని జెండా మీద త్రేతాయుగానికి చెందిన హనుమంతుని చిత్రం ఉంటుంది. ఎందుకు అర్జనుని జెండాపై హనుమంతుని చిత్రం ఉంటుందో తెలుసుకోవాలంటే దానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి.
కురుక్షేత్ర సంగ్రామం జరగడానికి కొన్ని రోజుల ముందు అర్జునుడు దేశాటనకు బయలుదేరాడట. అలా దేశంలోని అన్ని క్షేత్రాలను పర్యటిస్తూ అర్జనుడు రామేశ్వరానికి చేరుకున్నాడు. రామేశ్వరంలో శివుడు కొలువై ఉన్నాడు. అక్కడి శివలింగాన్ని సాక్షాత్తు రాములవారు ప్రతిష్టించారని ప్రతీతి. అయితే రామేశ్వరంలోని శివయ్యను అర్జనుడు పూజించాడట. ఆపై సముద్రతీరాన తిరుగుతూ అక్కడ రామసేతువును గమనించాడట. అది చూసిన అర్జనుడి అత్యంత శక్తి సంపన్నుడైన రాముడికి సేతువును నిర్మించేందుకు కోతుల సాయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని సందేహం కలిగిందట. అప్పుడేం జరిగిందో తరువాత కథనంలో తెలుసుకుందాం.