ఇంటి ఆవరణలో వేపచెట్టు ఉంటే ఇన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలా?

ఇంటి ఆవరణలో వేప చెట్టు ఉంటే ఎన్ని ప్రయోజనాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శాస్త్రీయ పరమైన, ఆధ్యాత్మిక పరంగానూ.. వాస్తు పరంగానూ ప్రయోజనాలున్నాయి. అసలు వేపచెట్టు ఇంటి ఆవరణలో ఉంటే ఎంత మేలు జరుగుతుందో చూద్దాం. హిందూమత విశ్వాసాల ప్రకారం వేప చెట్టు చాలా పవిత్రమైనది. ఇది కావల్సినంత ఆక్సీజన్‌తో పాటు ఆరోగ్యాన్నిస్తుంది. అలాగే వేపచెట్టు శ్రీ మహాలక్ష్మీ స్వరూపం కాబట్టి ఆర్థికంగానూ బాగుంటుంది. కుజ దోషం ఉంటే దానిని కూడా తొలగిస్తుందట. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంట వేప చెట్టును పెంచుకునేందుకు ఇష్టపడతారు.

రాహు, కేతు, శనీశ్వరుడి ప్రభావాలను సైతం వేపచెట్టు తగ్గించి ఇంటికి శ్రేయస్సును, సంపదను పెంచుతుందట. చెడు దృష్టితో పాటు పూర్వీకుల శాప ప్రభావం ఏమైనా ఉన్నా కూడా వాటన్నింటినీ తొలగిస్తుందని చెబుతారు. వేపచెట్టును లక్ష్మీదేవిగానే కాకుండా ఉత్తర భారతదేశంలో నీమారి దేవిగా కూడా వ్యవహరిస్తుంటారు. ఉగాది సమయంలో వేప పువ్వును.. అలాగే వేప రెమ్మలను కొన్ని శుద్ధి కార్యక్రమాల్లోనూ వినియోగిస్తూ ఉంటారు. నిత్యం వేపచెట్టుకు నీటిని పోస్తే మరింత ప్రయోజనం ఉంటుంది. వేపచెట్టుకు నీటిని పోయడం ద్వారా కుజ గ్రహ దుష్ప్రభావాలను శాంతింపజేసే హనుమంతుడి ఆశీర్వాదం మనకు లభిస్తుందట. అయితే దీనిని సవ్యమైన దిశలో పెంచకుంటే మాత్రం ఇబ్బందులు తలెత్తుతాయి. వేప మొక్క ఇంటి దక్షిణ దిశలో ఉంటే చాలా మంచిది.

Share this post with your friends