ఈ ఆలయంలో పూజలు నిర్వహించేది ఎవరికో తెలిస్తే షాకవుతారు..

ఆలయాలకు నెలవైన భారతదేశంలో కొన్ని విచిత్ర ఆలయాలున్నాయి. అన్ని ఆలయాల్లోనూ.. దేవుళ్లు, దేవతలు పూజలందుకుంటుంటే కొన్ని ఆలయాల్లో మాత్రం వీరు ఉండరు. అలాంటి ఒక విచిత్రమైన ఆలయం రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో ఒక రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ పూజలు అందుకుంటూ ఉంటుంది. అందుకే ఈ ఆలయం ‘బుల్లెట్ బాబా’ పేరుతో ప్రసిద్ధి చెందింది. అసలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు పూజలు నిర్వహించడమేంటి?ఈ ఆలయం రాజస్తాన్‌లోని పాలి జిల్లాలో బాంగ్డీ నుంచి చోటిలా అనే ప్రాంతంలో ఉంది. ఈ ఆలయ కథ మనల్ని భావోద్వేగానికి గురి చేస్తుంది.

1988లో ఓం సింగ్ రాథోడ్ అనే వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై పాలి నుంచి వెళుతుండగా చోటిలా అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించాడట. ప్రమాదానంతరం అతని బుల్లెట్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి తాళం వేశారట. అయితే ఆశ్చర్యకరంగా ఆ బుల్లెడ్ ప్రమాదం జరిగిన చోటుకు వెళ్లిపోయిందట. ఇలా ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తాళం వేసినా కూడా తిరిగి ప్రమాదం జరిగిన చోటుకే వెళ్లిపోయిందట. దీనిని దైవిక ఘటనగా భావించిన స్థానికులు అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించి ఓం సింగ్‌తో పాటు అతని బుల్లెట్‌ను పూజించడం మొదలు పెట్టారట. ఈ ఆలయానికి వచ్చే ప్రజలు రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌కు పువ్వుల దండ, కొబ్బరికాయ, మద్యాన్ని సమర్పించి రోడ్డు ప్రమాదం జరగకుండా చూడాలని మొక్కి ప్రార్థనలు చేస్తారు.

Share this post with your friends