తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం పరిధిలో వెలసిన బూరుగు గడ్డలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా.. ఈ ఆలయంలో గోదాదేవి కూడా కొలువై ఉంటుందని తెలుసుకున్నాం కదా. అమ్మవారి మూర్తి ఆరు అడుగుల ఎత్తు ఉంటుంది. అమ్మవవారి మూర్తి ఇంత ఎత్తుగా ఉండటం చాలా అరుదు. అమ్మవారి మూర్తిని చూడగానే మనసు భక్తి భావంతో పులకిస్తుంది. కోల కళ్లతో అందమైన ముక్కుతో.. రమ్యంగా ఉంటుంది. గోదాదేవి కొప్పు కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ కొప్పుతోతే అమ్మవారిని గుర్తించేందుకు వీలు కలుగుతుంది.
గోదాదేవి స్వయంభువుగా వెలిసిందని ఆలయ చరిత్ర ద్వారా మనకు తెలుస్తోంది. ఆలయ నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతున్న సమయంలో అమ్మవారి మూర్తి బయల్పడిందట. పూర్వం భృగు మహర్షి ఇక్కడ తపస్సు చేశాడట. భృగు మహర్షి పేరుమీదుగానే ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చిందట. ఇక్కడ విశేషమేంటంటే.. ముందుగా గోదాదేవి అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే ప్రధాన ఆలయంలోని మూర్తులను దర్శించుకోవాలనే ఒక నియమం ఇక్కడ ఉంది. కాబట్టి ఎవరైనా సరే.. ఆలయానికి వచ్చి ముందుగా అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత వేణుగోపాల స్వామిని దర్శించుకుంటారు.