ఈ నది నీటిని తాకితే ఎలాంటి పనైనా సర్వనాశనమేనట..

కొన్ని ఆలయాల్లోని నీటిని తాగడం వలన మనకు ఉన్న సకల రోగాలు, చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయని చెబుతారు. కానీ ఆసక్తికరంగా ఓ నది నీరు ఇందుకు రివర్స్. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు ఈ నదిని నీటిని తాకిన కూడా ఆ పని ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదట. ఆ నది పేరు కర్మనాశ నది. కర్మ అంటే పని.. నాశ అంటే నాశనం. అంటే మన పనిని నాశనం చేస్తుందన్న మాట. మరి మన పనిని నాశనం చేసే నది చివరకు కలిసేదెక్కడో తెలుసా? మనం అత్యంత పవిత్రంగా భావించే గంగానదిలో. అసలు ఈ నది ఎక్కడుంది? దీని చరిత్రేంటో తెలుసుకుందాం.

కర్మనాశ నది బీహార్‌లోని కైమూర్ జిల్లాలో పుట్టింది. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లో ప్రవహిస్తూ.. చివరికి పవిత్ర గంగానదిలో కలుస్తుంది. అంతేకాకుండా ఈ నది బీహార్, యూపీలను వేరు చేస్తుంది. కర్మనాశ నది ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర, చందౌలీ, వారణాసి, ఘాజీపూర్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది నీటిని తాకడం వల్ల మంచి పనులు సైతం రివర్స్ అవుతాయని నమ్మకం. అందుకే ఈ నది నీటిని అక్కడి ప్రజలు పొరపాటున కూడా ముట్టరు. ఏ పని కోసమూ ఈ నీటిని వినియోగించరు. ఈ నది ఒక శాపగ్రస్తుడైన రాజు లాలాజలం నుంచి ఏర్పడిన నది అని చెబుతారు. కాబట్టి దీనిని కర్మనాశ నది అని, శాపగ్రస్త నది అని పిలుస్తారు.

Share this post with your friends